మల్లిక్ రామ్ దర్శకుడిగా పరిచయమవుతూ… తేజ సజ్జా, రాజశేఖర్ ముద్దుల తనయ శివానీ హీరో, హీరోయిన్లుగా కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పైన ఉంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడగా మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక ఇదిలా ఉండగా నేడు శివాని పుట్టినరోజు కావడంతో.. ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అద్భుతం అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేయగా.. తేజ – శివాని ఇద్దరూ ఓ టేబుల్ పై కూర్చొని టైం చూసుకుంటున్నట్లుగా మిర్రర్ ఇమేజ్ స్టైల్ లో ఈ పోస్టర్ డిజైన్ చేయబడింది. పోస్టర్ కూడా టైటిల్ కు తగ్గట్టే ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యు.ఎస్.కు చెందిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎస్ ఒరిజినల్స్, మహాతేజ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీనికి ప్రశాంత్ వర్మ కథ అందించగా.. లక్ష్మీ భూపాల స్క్రీన్ ప్లే ,మాటలు అందిస్తున్నాడు. ఈసినిమాకు రథన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా విద్యాసాగర్ చింతా సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించనున్నారు.
ఇదిలా ఉండగా శివాని ఇప్పటికే ఇండస్ట్రీ కి పరిచయమై ఉండాలి. అప్పట్లో శివాని టూ స్టేట్స్ తెలుగు రీమేక్‌తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంది. అడవిశేష్, శివానీ కాంబోలో ఫైనల్ చేసిన ఈ ప్రాజెక్టు లాంఛనంగా ప్రారంభమైంది కూడా. ఈ చిత్రం 2019లో సెట్స్‌పైకి వెళ్లగా..కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: