చిన్న పాత్రల ద్వారా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివ కార్తికేయన్ ఇప్పుడు స్టార్ హీరోగా కెరీర్ లో దూసుకెళుతున్నాడు. ఇక ‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో శివ కార్తికేయన్. దానితో తన సినిమాలు కూడా తమిళ్ తో పాటు తెలుగులో రిలీజ్ చేస్తూనే వున్నాడు. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో శివకార్తికేయన్ ‘డాక్టర్’ అనే సినిమా తో వస్తున్న సంగతి తెలిసింద కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది మార్చి 26న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ అప్పుడు తమిళ్ నాడు ఎన్నికలు ఉండటం… ఆతరువాత కరోనా సెకండ్ వేవ్ వల్ల మళ్లీ లాక్ డౌన్ రావడం వల్ల రిలీజ్ కాస్త ఆగిపోయింది. ఇక ఈనేపథ్యంలో తాజాాగా ఈసినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాడనికి రెడీ అయ్యారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈసినిమా రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ్, మాలయాళం, కన్నడ నాలుగు భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు.
ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. యోగిబాబు, వినయ్ ప్రధానపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను శివకార్తికేయన్, కేజేఆర్ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: