హీరో కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై వశిష్ఠ్ మల్లిడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఒక సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది. కేథరిన్ థ్రెసా , సంయుక్త మీనన్ కథానాయికలు. సూపర్ హిట్ “గౌతమి పుత్ర శాతకర్ణి” మూవీ ఫేమ్ చిరతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. తన గ్రాండ్ ఫాదర్ లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామా రావు 98 వ జన్మ దినం సందర్భం గా అనౌన్స్ చేసిన ఈ మూవీ టైటిల్ “బింబిసార ” , ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బింబిసారుడి జీవితచరిత్రగా “బింబిసార “మూవీ తెరకెక్కుతుంది. “బింబిసార ” మూవీ లో హీరో కళ్యాణ్ రామ్ ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.యాక్షన్ సీన్స్ లో కళ్యాణ్ రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసినట్టు , కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందిన మూవీస్ లో “బింబిసార ” మూవీ ది బెస్ట్ గా నిలవనున్నట్టు, మరో 10 శాతం చిత్రీకరణ జరిగితే, షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానున్నట్టు సమాచారం. హీరో కళ్యాణ్ రామ్ ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: