ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ ‘ ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇక ఈసినిమా షూటింగ్ ను ఇటీవలే మళ్లీ స్టార్ట్ చేయగా దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈసినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయినట్టు తెలుస్తుంది. ఇంకా రెండు పాటలు మాత్రమే మిగిలిఉన్నట్టు సమాచారం. అంతేకాదు ఈ గ్యాప్ లో ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారట. ఇక చాలా రోజుల నుండి ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో తాజాగా పోస్టర్ రిలీజ్ చేయగా ఎన్టీఆర్ బైక్ నడుపుతుంటే.. రాంచరణ్ వెనక కూర్చుని నవ్యుతున్న ఈ పోస్టర్ ఆకట్టుకోగా ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ గా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో పలు యాక్షన్ సీక్వెన్స్ ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే రెయిన్ బ్యాక్ డ్రాప్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని.. ఆ యాక్షన్ సీక్వెన్స్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఉంటారని.. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఈ యాక్షన్ సన్నివేశం హైలెట్ గా ఉంటుందని అంటున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఇక దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: