అక్కినేని నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ బయట లొకేషన్స్ లలో ఎక్కువ భాగం షూట్ చేయాల్సి ఉంది. కరోనా కారణంగా అది కష్టం కాబట్టి షూట్ కు బ్రేక్ పడింది. అయితే ఈ నేపథ్యంలోనే అన్నపూర్ణ స్టూడియోలో ఓ ప్రత్యేక సెట్ ను నాగార్జున వేయించినట్టు తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను కూడా షూట్ చేయనున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా అందులో నాగార్జున మాజీ రా అధికారి పాత్రలో నటిస్తున్న సంగతి తెలుస్తుంది. ఇలాంటి సినిమాలకు యాక్షన్ ఎపిసోడ్స్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. దీనికోసం ఇజ్రాయేల్ ఆర్మీ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ క్రవ్ మగ, సమురాయ్ స్వార్డ్ ఫైటింగ్‌లో నాగార్జున శిక్షణ తీసుకున్నారట.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.అంతేకాదు ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో బాలీవుడ్ బ్యూటీ గుల్ పానంగ్ నటించబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ తెలిపింది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: