19 ఏళ్ల జయం.. మరిచిపోలేని జ్ఞాపకం

Actor Nithiin Pens A Heart Warming Note On Social Media As His Debut Movie Jayam Completes 19 Years Today,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nithiin Completes 19 Years In Telugu Film Industry,19 Years For Nithiin,19 Years Of Nithiin,19 Years For Nithiin In TFI,19 Years For Nithiin In Telugu Film Industry,Jayam,Jayam Movie,Jayam Telugu Movie,19 Years For NITHIIN in TFI,19 Successful Years Of Youth Star Nithiin In TFI,19 Successful Years Of Nithiin In TFI,19 Years For Jayam Movie,19 Years Of Jayam Movie,19 Years For Jayam,19 Years Of Jayam,Jayam Telugu Movie Updates,Jayam Movie Updates,Jayam Movie Latest Updates,Jayam Movie Songs,Jayam Songs,Jayam Telugu Full Movie,Jayam Full Movie,Jayam Movie Videos Songs,Teja,Director Teja,Gopichand,RP Patnaik,19 Years For Youth Star Nithiin And Sadaa's Jayam,Sadaa,Acress Sadaa,Heroine Sadaa,Youth Star Nithiin,Nithiin And Sadaa's Jayam Movie Completes 19 Years,Nithiin's Jayam Movie Completes 19 Years,Nithiin And Sadaa,Nithiin And Sadaa Movie,Nithiin And Sadaa Jayam Movie,Hero Gopichand,#19YearsForNITHIINinTFI,#19YearsForJayam

అప్పట్లో యూత్ ను ఆకట్టుకునే సినిమాలు తీయడంలో డైరెక్టర్ తేజ పేరు ముందుండేది. అలా
తేజ దర్శకత్వంలో నితిన్, సదా జంటగా నటించిన ‘జయం’ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తేజ డైరెక్షన్‌లో ఆర్పీ పట్నాయక్ సంగీతంతో అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్‌ను కుదిపేసింది. ఈ సినిమా అటు డైరెక్టర్ తేజ తో పాటు నితిన్, సదా, ఆర్పీకి వరుస అవకాశాలు వచ్చేలా చేసింది. బెస్ట్ డెబ్యూ హీరోగా నితిన్, హీరోయిన్‌గా సదా ఫిల్మ్ ఫేర్ అవార్టులు అందుకున్నారు. ఇక సదా చెప్పే ‘వెళ్లవయ్యా వెళ్లు.. వెళ్లూ..’ అంటూ చెప్పే డైలాగ్ చాలా ఫేమస్ అయింది. ఈసినిమా విజయానికి ఉన్న ప్రధాన కారణాల్లో ఆర్పీ పట్నాయక్ సంగీతం ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తన సంగీతంతో ఈ సినిమాను మరో మెట్టుకు తీసుకెళ్లాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి హీరోగా చేయాలని ఫిక్స్ అయినప్పుడు వేరే పాత్రలకు చేయడానికి అంత తొందరగా ఒప్పుకోవడం కష్టం. అదీ కూడా ఇంకా నటుడిగా గుర్తింపురాకముందే.. కానీ అప్పుడప్పుడే పలు సినిమాల్లో హీరోగా చేస్తున్న తరుణంలోనే గోపిచంద్ ఈసినిమాకు విలన్ గా ఒప్పుకొని చాాలా ధైర్యం చేశాడు. ఆపాత్రలో గోపిచంద్ తప్పా ఇంకెవరూ అలా చేయలేరేమో అన్నట్టు చేశాడు. అందుకే గోపీచంద్‌ బెస్ట్ విలన్‌గా నంది అవార్డు దక్కించుకున్నాడు.

ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో తమిళంలో రీమేక్ చేశారు. తమిళంలో రవి, సదా జంటగా నటించారు. అక్కడ కూడా సినిమా సూపర్ హిట్టే. ఆ సినిమాతో రవి కాస్త జయం రవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈరోజుల్లో అంటే కోట్లకు కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు కానీ.. అప్పట్లో చాలా తక్కువ బడ్జెట్ తో సినిమా తీసేశారు. ఈసినిమా కూడా కేవలం రూ.1.80కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తే లాంగ్ రన్‌లో సుమారు రూ.32 కోట్ల వ‌ర‌కు కలెక్షన్లు సాధించింది.

ఇక ఈసినిమా రిలీజ్ అయి నేటితో 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో నితిన్ తన ట్విట్టర్ ద్వారా ఈసినిమాను మరోసారి గుర్తుచేసుకున్నాడు. జయం 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసినిమా జర్నీ ఎప్పుడూ మరిచిపోలేని జ్ఞాపకం లాంటిది.. నాకు ఇంత ప్రేమ, సపోర్ట్ అందించిన అభిమానులకు థ్యాంక్స్ ముఖ్యంగా డైరెక్టర్ తేజ గారికి థ్యాంక్స్ అంటూ తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − 2 =