బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కియారా అద్వానీ , ఆమూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “వినయవిధేయ రామ ” మూవీ నిరాశ పరచడంతో కియారా తెలుగు మూవీస్ లో నటించలేదు. సూపర్ హిట్”అర్జున్ రెడ్డి ” హిందీ రీమేక్ “కబీర్ సింగ్ ” మూవీ ఘనవిజయం సాధించడంతో కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీగా మారారు. కియారా టాలీవుడ్ రీ ఎంట్రీ కై పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కియారా కథానాయికగా రూపొందిన “షేర్ షా ” మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కియారా ప్రస్తుతం “భూల్ భులయ్యా 2”, జుగ్ జుగ్ జియో “,”Mr లేలే ” మూవీస్ లో నటిస్తున్నారు. 7 సంవత్సరాలు ఫిల్మ్ కెరీర్ కంప్లీట్ చేసుకున్న కియారా అద్వానీని చిట్ చాట్ సెషన్ లో టాలీవుడ్ కమ్ బ్యాక్ ఎప్పుడు అని ఓ అభిమాని అడగడం తో లవ్ యూ ఆల్. త్వరలోనే ఎక్జయిటింగ్ ప్రకటన అంటూ కియారా ట్వీట్ చేశారు. కియరా ట్వీట్ తో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోతున్న 30వ సినిమాలో కైరా నటించబోతుందనీ , రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా తో అంటూ మరి కొందరు అనుకుంటున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: