తమిళ , తెలుగు , మలయాళ , హిందీ భాషలలో బాల నటిగా సుమారు 45 మూవీస్ లో నటించిన మీనా 1989సంవత్సరం లో “ఒరు పుదియ కథై “మూవీ తో కోలీవుడ్ , “నవయుగం “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “సీతారామయ్య గారి మనవరాలు “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి మీనా బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్ అందుకున్నారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో మీనా తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సీనియర్ హీరోయిన్ మీనా ప్రస్తుతం “అన్నాత్తే “(తమిళ ) “దృశ్యం 2 “తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమ లో 30 సంవత్సరాలుగా మీనా టాప్ హీరోయిన్ గా కొనసాగుతుండడం విశేషం. ‘‘ఇంతకు ముందు కొన్ని పాత్రల్లో నటించాలంటే మన ఇమేజ్‌కు సూటవుతుందా? లేదా?’ అని ఆలోచించాల్సి వచ్చేదనీ , ఇప్పుడు ప్రేక్షకుల మైండ్‌సెట్ మారిందనీ , సినిమాలో పాత్రలను పాత్రలుగా మాత్రమే చూస్తున్నారు. అర్థం చేసుకుంటున్నారనీ , విలక్షణ – వైవిధ్యమైన పాత్రల కోసం ఎదురుచూస్తున్నాననీ , నెగటివ్ రోల్ లో నటించాలని ఉందనీ మీనా చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: