చాలా గ్యాప్ తరువాత మారుతి గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ అలా మొదలుపెట్టారో లేదో కరోనా సెకండ్ వేవ్ రావడంతో షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఇక సినిమాతో పాటు సంతోష్ శోభన్ తో కూడా ఇటీవల మరో చిన్న సినిమాను లైన్ లో పెట్టినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక చిన్న కాన్సెప్ట్ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ స్క్రిప్ట్ ను సంతోష్ కోసం మారుతి సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ వెబ్ డ్రామా కు అప్పుడే టైటిల్ కూడా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. మంచి రోజులు వచ్చాయి అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పనిలో ఉండగా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా త్వరలో స్టార్ట్ చేయనున్నాడట. ఇందులో మెహ్రీన్ హీరోయన్ గా నటిస్తుంది.
కాగా రీసెంట్ గా ఏక్ మినీ కథతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సంతోష్ శోభన్ ప్రస్తుతం సారంగ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అభిషేక్ మహర్షి అనే నూతన దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈసినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేశారు. ప్రేమ్ కుమార్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: