సినీ ఎన్ సైక్లోపీడియా.. ‘బిఏ రాజు’ మృతికి సినీ ప్రముఖుల సంతాపం

Tollywood Film Fraternity Mourns The Demise Of Renowned Movie Producer and PRO BA Raju,Chiranjeevi,Nagarjuna,Venkatesh,Mahesh Babu,Publicist And Producer BA Raju Dies At 57,RIP BA Raju,Film Industry Celebs Mourn BA Raju's Demise,Senior Journalist And Pro BA Raju Passes Away,Chiranjeevi Mourns For The Loss Of BA Raju,Mahesh Babu And Chiranjeevi Deep Condolence To BA Raju,Tollywood Mourns The Death Of Senior Journalist,Telugu Film Fraternity Mourns The Death Of Producer BA Raju,Film Industry Celebs Mourn BA Raju's Demise,Chiranjeevi Others Mourn BA Raju's Death,Chiranjeevi On Twitter,Tollywood Mourns the Demise of PRO BA Raju,BA Raju,BA Raju Is No More,BA Raju Passes Away,BA Raju Died,BA Raju Death,BA Raju News,BA Raju Latest Updates,BA Raju No More,BA Raju Is Dead,BA Raju News,BA Raju Latest News,Producer BA Raju Passes Away,Senior Film Journalist BA Raju Passes Away,BA Raju Passed Away,Producer BA Raju,Senior Journalist BA Raju Passes Away,Telugu Film Producer Dil Raju,Jr NTR

ప్రముఖ నిర్మాత, పీఆర్వో బిఏ రాజు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్న ఆయన మరణ వార్త తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని కదిలించివేసింది. ప్రతి ఒక్కరూ తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలో బిఏ రాజు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ తమ మధ్య ఉన్న అనుబంధాన్ని అలాగే బిఏ రాజు గురించి ఉన్నతను చెప్పుకొచ్చారు. బిఏ.రాజు.. ఈ పేరు తెలియని వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉండరు. మద్రాసులో ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో విశేషాల్ని ఆయన నాతో షేర్ చేసుకునేవారు. ప్రతి కొత్త విషయాన్ని ఆయన నుంచి తెలుసుకునేవాడిని.. షూటింగ్ స్పాట్ లో వచ్చి నాతో చాలా సరదాగా ముచ్చటించేవారు. నా చాలా సినిమాలకు ఆయన పీఆర్వోగా పని చేశారు. సినిమాల సమస్త సమాచారం.. సంవత్సరాల క్రితం రిలీజైన క్లాసిక్స్ కి సంబంధించిన కలెక్షన్స్ ట్రేడ్ రిపోర్ట్ రికార్డుల గురించి యథాతథంగా చెప్పగల గొప్ప నాలెడ్జ్ బ్యాంక్ ఆయన. ఏ సినిమా ఏ తేదీన రిలీజైంది? ఎంత వసూలు చేసింది? ఏ సెంటర్ లో ఎన్ని రోజులు ఆడింది.. 100 రోజులు 175 రోజులు 200 రోజులు అంటూ ప్రతిదీ పరిశ్రమకు “ఎన్ సైక్లోపెడియా”లా సమాచారం అందించేంత ప్యాషన్ వున్న పత్రికా జర్నలిస్ట్.. మేధావి.. సూపర్ హిట్ సినీమ్యాగజైన్ కర్త, అనేక సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన బి.ఏ.రాజుగారు లాంటి వారు ఉండడం పరిశ్రమ అదృష్టం. అలాంటి వ్యక్తి నేడు లేడు! అన్న వార్త విని షాక్ కి గురయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.” అని చిరు తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.

ఎన్టీఆర్ స్పందిస్తూ.. ఆయన ఆకస్మిక మరణం విని షాకయ్యాను.. ఒక సీనియర్ ఫిలిం జర్నలిస్టుగా, పీఆర్వోగా సినిమా ఇండస్ట్రీకి రాజు గారు చాలా చేశారు.. నేను సినీ పరిశ్రమకు అడుగుపెట్టిన దగ్గర నుండి ఆయన నాకు తెలుసు.. బీఏ రాజు లాంటి వ్యక్తి ఇప్పుడు లేకపోవడం ఇండస్ట్రీకి అతి పెద్ద లోటు అని అన్నారు ఎన్టీఆర్.రాజు గారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తూ. అలాగే ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు.

టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు గారు తన సంతాపాన్ని తెలియజేసారు.“బి ఏ రాజు… నువ్వు లేని తెలుగు సినిమా మీడియా మరియు పబ్లిసిటీ, ఎప్పటికీ లోటే… తరతరాలుగా నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అందించిన సేవలు కలకాలం గుర్తుండిపోతాయి. నీ ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.” అని తన సంతాపాన్ని తెలియచేశారు.

నాగార్జున తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా గొప్ప ఫ్రెండ్‌ని కోల్పోయానని ఎమోషనల్‌ అయ్యారు. `గత 37ఏళ్లుగా నా వెల్‌ విషర్‌, మంచి స్నేహితుడు బి.ఏ.రాజుగారు. ఆయన్ని మేం చాలా మిస్‌ అవుతున్నాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా మిస్‌ అవుతుంది` అని పేర్కొన్నారు.

విక్టరీ వెంకటేష్‌ స్పందిస్తూ, `బి.ఏరాజుగా లేరనే వార్తతో నాకు మాటలు రావడం లేదు. నా మొదటి సినిమా నుంచి…ఆయన తెలుసు. ఆయన మంచి హృదయం కలిగిన గొప్ప వ్యక్తి. ఆయన మరణం తీరని లోటు` అని ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =