టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా కొనసాగుతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ “F 2″మూవీ సీక్వెల్ “F 3”, బాక్సింగ్ నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. “గని “మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. బాక్సర్ గా ట్రైనింగ్ పొందిన వరుణ్ తేజ్ తన ఫిజిక్ కాపాడుకొనడానికి జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో వరుణ్ తేజ్ తన నెక్స్ట్ మూవీ కి ప్లాన్ చేసుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ “ఛలో “, “భీష్మ ” మూవీస్ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ కి వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ మూవీ దసరా నుండి సెట్స్ పైకి వెళ్ళనుందనీ , “ఛలో “, “భీష్మ “మూవీస్ హీరోయిన్ రష్మిక కథానాయికగా నటించే అవకాశం ఉందనీ సమాచారం. హీరో వరుణ్ తేజ్ , రష్మిక ఫస్ట్ కాంబినేషన్ ప్రేక్షకులను అలరించనుందనడం లో సందేహం లేదు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: