ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ “కెజిఎఫ్ చాప్టర్ 1 “ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడి కన్నడ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రం గా రికార్డ్ క్రియేట్ చేసింది. “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ కి సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు . ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “కెజిఎఫ్ చాప్టర్ 2 ” మూవీని జూలై 16 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దసరా పండగకు రిలీజ్ కానుందని సమాచారం.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: