టాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ లను వాయిదా వేసుకున్నాయి. ఇక ఇప్పుడు నారప్ప కూడా వెనక్కి తగ్గాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకీ ప్రధాన పాత్రలో నారప్ప సినిమా వస్తుంది. ఇక ఈసినిమాను మే 14న రిలీజ్ చేయాలని డేట్ ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడున్న సెకండ్ వేవ్ కారణంతో ఈసినిమాను కూడా వాయిదా వేస్తున్నట్టు నిర్మాణ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలో ”నారప్ప చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు అభిమానులకు.. అందరికీ మనవి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనందరి ఆరోగ్యం రక్షణ దృష్టిలో ఉంచుకుని చిత్రం విడుదలని వాయిదా వేస్తున్నామని తెలియజేస్తున్నాం. పరిస్థితులు చక్కబడిన తర్వాత అతి త్వరలోనే ఈ చిత్రాన్ని మీ ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ మహమ్మారి వీలైనంత తొందరగా దూరం కావాలని అందరూ క్షేమంగా ఉండాలని ఈ చిత్రానికి ఇష్టంతోనూ అంకితభావంతోనూ పనిచేసిన ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. అందరం ఇళ్లల్లోనే ఉండి మన పట్ల మన కుటుంబ సభ్యుల పట్ల జాగ్రత్తగా ఉందాం. ఈ క్లిష్ట పరిస్థితిని అందరం కలిసికట్టుగానే ఎదుర్కొందాం. అందరం మాస్కులు ధరించి దూరాన్ని పాటిస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండటమే మనం పొరుగువారికీ సమాజానికి చేసే గొప్ప సాయం. త్వరలోనే మీ ముందుకు వచ్చి మిమ్మల్నందరినీ అలరించాలని కోరుకుంటున్నాం” అని ‘నారప్ప’ టీమ్ పేర్కొంది.
In lieu of the pandemic, #Narappa will not be releasing on May 14th . A new theatrical date will be announced once we overcome this unprecedented crisis.
Stay safe ! #NarappaPostponed@VenkyMama #Priyamani @KarthikRathnam3 #SrikanthAddala #ManiSharma @SureshProdns @theVcreations pic.twitter.com/i5AT8JMsuH— Suresh Productions (@SureshProdns) April 29, 2021
కాగా ప్రియమణి ఈ సినిమాలో సుందరమ్మగా నటిస్తుంది. కేరాఫ్ కంచరపాలెం ఫేం కార్తీక్ రత్నం కీలక పాత్రలో నటిస్తున్నాడు. నారప్ప పెద్ద కొడుకు మునికన్నా పాత్రలో కార్తీక్ రత్నం నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: