మెగా హీరోల్లో ఇప్పటికే చాలామంది కోరనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కాస్త ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే చాలామంది హీరోలు తమ షూటింగ్ లను ఆపేసుకున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం సినిమాను అనుకున్న టైమ్ కే రిలీజ్ చేయాలని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పుష్ప షూటింగ్ ను ఆపలేదు. అయితే ఇప్పుడు బన్నీకి కూడా కరోనా పాజిటివ్ రావడంతో షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని స్వయంగా బన్నీనే తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ”నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం నేను సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నాను. నాతో ఇటీవల కాంటాక్ట్ అయిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను బాగానే ఉన్నాను. నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని నా శ్రేయోభిలాషులు మరియు అభిమానులందరినీ కోరుకుంటున్నాను.. ఇంట్లో ఉండండి సురక్షితంగా ఉండండి” అని బన్నీ ట్వీట్ లోపేర్కొన్నాడు.
Hello everyone!
I have tested positive for Covid. I have isolated myself.
I request those who have come in contact with me to get tested.
I request all my well wishers and fans not to worry as I am doing fine . Stay home, stay safe . pic.twitter.com/CAiKD6LzzP— Allu Arjun (@alluarjun) April 28, 2021
సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్, టీజర్ తోనే ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో చేస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది. ఈ ఏడాది ఆగస్టు 13న `పుష్ప` సినిమా విడుదల చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.