టాలీవుడ్ హీరోయిన్స్ లో సమంతను ఆల్ రౌండర్ అనొచ్చు. ఎందుకంటే హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా పలు రంగాల్లో కూడా తన మార్క్ ను చూపిస్తుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత ఆసినిమాలో జెస్సీ పాత్రలో అందరినీ మాయ చేసేసింది. ఇక ఆసినిమా తరువాత సమంత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరంలేదు. వరుస హిట్లతో దూసుకుపోయింది. లక్కీ హీరోయిన్ గా కూడా పేరుతెచ్చుకుంది. హీరోయిన్ గా కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం కాలేదు. పాత్ర ప్రాముఖ్యత పాత్రలు కూడా చేసి మెప్పించింది అందరినీ.. రంగస్థలం సినిమాలో డీగ్లామర్ పాత్రలో కానీ.. ఓ బేబి సినిమాలో 60 ఏళ్ల భామ యువతిగా మారితే ఎలా ఉంటుందో అన్న పాత్రలో కానీ… యూటర్న్ తో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కానీ.. విక్రమ్ 10 సినిమాలో విలన్ పాత్రలో కానీ.. అలాగే మజిలీ సినిమాలో గృహిణి పాత్రలో ఇలా ఏ పాత్ర అయినా సరే తను చేయగలనని నిరూపించుకుంది. ఇక పెళ్లి తరువాత కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సినిమాలు చేస్తూనే మరోవైపు యాంకర్ గా బిజినెస్ లోనూ రాణిస్తుంది. ఇక నేడు సమంత పుట్టినరోజు. ఇలాంటి పుట్టిన రోజులు సమంత మరెన్నో జరుపుకోవాలని.. మరిన్ని మంచి మంచి సినిమాలు అందిచాలని కోరుకుందాం. ఈనేపథ్యంలో తను నటించిన సినిమాల్లో మీకు బెస్ట్ అనిపించిన సినిమాను మీ ఓటు ద్వారా తెలుపగలరు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”59852″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: