పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి జ్యోతి లక్ష్మీ సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో ఒకడిగా ఎదిగాడు సత్యదేవ్. రొటీన్ గా ఉండే సినిమాలు కాకుండా తన సినిమాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటాడు కాబట్టే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్లఫ్ మాస్టర్, బ్రోచేవారెవరురా, రాగల 24 గంటల్లో, 47 డేస్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, గువ్వ గోరింక, పిట్టకథలు చిత్రాలతో హీరోగా నిరూపించుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సత్యదేవ్ తన కెరీర్ ను ప్రారంభించి అప్పుడే పదేళ్లు అయిపోయింది. ఈసందర్భంగా తన కెరీర్ ను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా లో పోస్ట్ ద్వారా అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. ఎన్నోకలలు, ఆశయాల తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను.. ఈ పదేళ్ల జర్నీలో నా అడియన్స్, డైరెక్టర్స్, నిర్మాతలు, కో స్టార్స్ అందరూ సహకరించారు. ఇదే కలలు.. ఆశలతో ఇంకెంతో సినీ ప్రయాణం చేయాలి.. ఇక ముందు ముందు సినీ ప్రయాణంలో కూడా అందరూ తోడుగా ఉంటారని కోరుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
ప్రస్తుతం టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. గుర్తుందా శీతాకాలం టైటిల్ తో ఈ సినిమా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనితో పాటు నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు అనే సినిమాను చేయనున్నాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరుతో కలిసి ఎస్ ఒరిజినల్స్ బ్యానర్‌పై నిర్మాత సృజన్ ఎరబోలు ‘తిమ్మరుసు’ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: