పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన వకీల్ సాబ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చూస్తూనే ఉన్నాం. దాదాపు మూడేళ్ల తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ గా వచ్చి బాక్సాఫీస్ బరిలో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ అయి వారం రోజులు అవుతున్నా ఇంకా మంచి కలెక్షన్సే రాబడుతుంది. ఇక తొలి షో నుండి ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించగా, ప్రతి ఒక్కరు మూవీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా మహళా ప్రాధాన్యత సినిమా అవ్వడంతో మహిళలకు బాగా చేరువైంది ఈసినిమా. పవన్ కం బ్యాక్ సినిమా వకీల్ సాబ్‌ను అభిమానులే కాదు తోటి హీరోలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియావేదికగా పవన్ పై చిత్రయూనిట్ పై, పవన్ పై ప్రశంసలు కూడా కరిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈనేపథ్యంలో ఈసినిమాను ఎన్టీఆర్ కూడా చూశాడట. అంతేకాదు చూసి పవన్ ను హత్తుకున్నాడట. ఈవిషయం ఎవరో కాదు ఇటీవల ఇంటర్య్వూలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ స్వయంగా వెల్లడించారు. మహిళల గురించి వకీల్ సాబ్ చిత్రంలో అద్భుతంగా చూపించారని అది ఎన్టీఆర్‌కు కూడా నచ్చడంతో ఆయన స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి మరీ తన ఓపీనియన్ తెలియజేశారట.
ఈ సినిమా విషయానికి వస్తే..అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన పింక్ సినిమాకు తెలుగులో పవన్ హీరోగా రీమేక్ గా తెరకెక్కింది. దర్శకుడు వేణు శ్రీరామ్ పింక్ సినిమాలోని కథను పవన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా పక్కా కమర్షియల్ సినిమాగా రూపొందించాడు. పవన్ కు జోడీగా శృతిహాసన్ నటించగా, ప్రకాష్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: