రామ్ 19 సినిమాకు డీఎస్పీ

Rockstar Devi Sri Prasad To Score Music For Ram Pothineni Upcoming Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Music Director Devi Sri Prasad,Devi Sri Prasad,DSP,Devi Sri Prasad Songs,DSP Songs,Devi Sri Prasad Music,DSP Music,RaPo19 Movie,RAPO 19,RAPO 19 Telugu Movie,RAPO 19 Update,RAPO 19 Movie Update,RAPO 19 Movie Latest Updates,RAPO 19 Movie News,RAPO 19 Movie Latest news,RAPO 19 Music,Devi Sri Prasad Onboard For RaPo19 Movie,DSP Onboard For RAPO 19 Movie,DSP For RAPO 19,Ram Pothineni,Actor Ram Pothineni,Ram Pothineni RAPO 19 Movie,RAPO 19 Music Director,RAPO 19 Music Director DSP,Devi Sri Prasad Onboard For RAPO19,Krithi Shetty,Ram Pothineni New Movie,#RAPO19

ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు రామ్. ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో రామ్ 19 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రామ్ తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండగా.. లింగుస్వామికి ఇది తొలి తెలుగు చిత్రంగా నిలువనుంది. ఇక ఈ సినిమాలో రామ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ అఫీసర్ రోల్‌లో కనిపించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. త్వరలోనే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకోసం మ్యూజిక్ డైరెక్టర్ ను కన్ఫామ్ చేస్తూ నిర్మాతలు తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈసినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేయనున్నాడు. ఇక రామ్ చాలా సినిమాలకు దేవి సంగీతం అందించాడు. ఎన్నో హిట్ ఆల్బమ్స్ అందించారు. మరి ఈసినిమాకు కూడా అదే రేంజ్ లో అందిస్తాడేమో చూద్దాం.

‘ఉప్పెన’ సినిమాలో తన నటనతో అందరిని మెప్పించిన కృతి శెట్టి ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో నటించే నటీనటులు.. సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.