ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ వల్ల బాలీవుడ్ లో చాలా మంది నటీనటులు కరోనాబారిన పడ్డారు. తెలుగు చిత్రసీమలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా చాలా మంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల నిర్మాత అల్లు అరవింద్, రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు త్రివ్రికమ్, హీరోయిన్ నివేదా థామస్‌లు కరోనా బారినపడ్డారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలోనే గుణశేఖర్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్తలు వచ్చాయి. అయితే ఆవార్తలపై స్పందించిన గుణశేఖర్ క్లారిటీ ఇచ్చాడు. నాకు కరోనా పాజిటివ్ వచ్చిందన్నది అంతా ఫాల్స్.. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను.. డాక్టర్స్ ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని.. నిర్ధారించినట్టు వెల్లడించాడు. ఇక కోరనా నిబంధనలతో శాకుంతలం షూటింగ్ కూడా మళ్లీ మొదలుపెట్టనున్నట్టు తెలిపాడు.
Hi Happy Ugadi to you all Yesterday I had a false positive COVID test during a routine testing activity that we do on sets upon further testing and inspection it was confirmed by doctors that I DO NOT have COVID and so I’d be resuming the shoot with all precautions in place 🙏
— Gunasekhar (@Gunasekhar1) April 13, 2021
గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే అద్భుతమైన ప్రేమకావ్యం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. ఈసినిమాలో మరో కీలక పాత్రలో అదితి బాలన్ కూడా నటిస్తుంది. ఈ సినిమాను గుణ శేఖర్ తన సొంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: