కరోనా ఎఫెక్ట్.. విరాటపర్వం కూడా వాయిదా

Virata Parvam Movie Release Postponed,Telugu Filmnagar,Telugu Film News 2021,Rana Daggubati,Rana's Virata Parvam Movie Release Date Postponed,Virata Parvam Release Date Postponed,Rana Daggubati Virata Parvam,Rana Daggubati Virata Parvam Postponed,Virata Parvam Movie Postponement,Virata Parvam Postponed,Virata Parvam Movie Postponed,Virata Parvam Telugu Movie Postponed,Virata Parvam Movie Release Postponed,Virata Parvam Release Postponed,Virata Parvam New Release Date Announced Soon,Rana Daggubati's Virata Parvam Release Gets Postponed,Rana Daggubati and Sai Pallavi's Virata Parvam Postponed,Sai Pallavi,Rana And Sai Pallavi Starrer Virata Parvam Release Gets Postponed,Virata Parvam Release Postponed Officially,#VirataParvam

కరోనా దెబ్బకు గత ఏడాది సినీ ఇండస్ట్రీ మొత్తం చాలా నష్టపోయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని అనుకుంటున్న తరుణంలో సెకండ్‌ వేవ్‌ దెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో క్రమంగా సినిమా రిలీజ్‌లు వెనక్కి వెళుతున్నాయి. ఇప్పటికే ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సిన లవ్‌స్టోరి, ఏప్రిల్‌ 23న విడుదల కావాల్సిన టక్‌ జగదీష్‌ చిత్రాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు వీటి సరసన విరాటపర్వం కూడా చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కరోనా తీవ్రమవుతున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 30న విడుదల …కావాల్సిన సినిమాని వాయిదా వేస్తున్నామని ప్రకటించింది. తదుపరి తేదీని త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపింది.

వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా హీరోగా వస్తున్న సినిమా. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌తో సినిమా రూపొందుతున్న ఈసినిమాలో రానా కామ్రేడ్‌ రవన్నగా నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే పోస్టర్లు, ఫస్ట్‌ గ్లింప్స్‌, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా సాయిప‌ల్ల‌వి హీరోగా నటిస్తున్న ఈసినిమాలో… ముఖ్య పాత్ర‌ల్లో ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, నివేతపేతురాజ్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావ్‌, సాయిచంద్ క‌నిపించ‌నున్నారు. డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 18 =