గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే అద్భుతమైన ప్రేమకావ్యం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమా కోసం ఎప్పటిలాగే గుణశేఖర్ భారీ సెట్స్ ను వేశాడు. సినిమా చాలా వరకూ అక్కడే షూటింగ్ జరుపుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో మరో కీలక పాత్రలో అదితి బాలన్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అదితి బాలన్ తమిళ్ నటి. అరువి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదితి మొదటి సినిమాతోనే మంచి పేరుతెచ్చుకుంది. ఇక ఈసినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. త్వరలోనే షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈసినిమాలో సమంత సరసన దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. మరో హీరోయిన్ పాత్రకు తెలుగు అమ్మాయి ఈషాను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: