ఇప్పటికే బుల్లి తెరపై బిగ్ బాస్ కు యాంకరింగ్ చేసి అలరించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక ఇప్పుడు మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు షో కు ఎన్టీఆర్ హోస్ట్ గా చేయనున్నాడు. మొదటి మూడు సీజన్లకి కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించగా, 2017లో వచ్చిన నాలుగో సీజన్‌కి మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ హోస్ట్‌గా చేయనున్నాడు. ఇక తాజాగా ఈ షో ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. మరికొద్ది రోజుల్లో ఈ షో ప్రారంభం కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక్కడ కల మీది కథ మీది. ఆట నాది కోటి మీది.
I’ll be waiting to meet you on the hot seat.
రండి గెలుద్దాం.https://t.co/k1X6PxlJHF
— Jr NTR (@tarak9999) March 13, 2021
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇక ఈసినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను అధికారికంగా ఎప్పుడో ప్రకటించారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: