సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నారులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పటికే వెయ్యికి పైగా గుండె ఆపరేషన్ లు చేయించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఇక ఇప్పుడు మరోచిన్నారికి తోడుగా నిలబడి సాయం అందించారు. మహేష్ కుటుంబం ప్రముఖ ఆంధ్రప్రదేశ్ యాజమాన్యంతో కలిసి చిన్నపిల్లలకు ఆపరేషన్ లు చేయిస్తున్నసంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే గుండె సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరిన ఓ చిన్నారి అంకిత్ భార్గవ్‌కు మహేష్ ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దీంతో అతడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ మహేశ్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈవిషయాన్ని నమ్రత తన ఇన్ స్టా ద్వారా తెలిపింది. హార్ట్ వామింగ్ స్టోరి. వీఎస్‌డీ, పీడీఏతో బాధపుడుతున్న చిన్నారి అంకిత్ భార్గవ్ ఆపరేషన్ అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఆయ్యాడన్న విషయం ఆనందాన్ని ఇస్తుంది. అతడు పూర్తి ఆరోగ్యవంతుడిగా జీవించాలని ఆశిస్తున్నా. చిన్నారి ఆపరేషన్ చేసిన ఆంధ్రప్రదేశ్ హస్పీటల్ హెల్త్‌కేర్ వైద్యులకు ధన్యవాదాలు’ అంటూ నమ్రతా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
View this post on Instagram
ప్రస్తుతం మహేష్ పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా దుబాయ్ లో చాలా రోజులు షూటింగ్ ను జరుపుకుంది. నెక్ట్స్ షెడ్యూల్ ను కూడా అక్కడే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 20 రోజుల పాటు దుబాయ్‌లో తొలి షెడ్యూల్ చిత్రీకరించనున్నారు. ఇక ఈ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: