మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ , లావణ్య త్రిపాఠి జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “చావు కబురు చల్లగా “మూవీ మార్చి 19 వ తేదీ రిలీజ్ కానుంది. హీరోకార్తికేయ బస్తీ బాలరాజు గాఒక మాస్ క్యారెక్టర్ లో నటించిన ఈ మూవీ లో ఆమని , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటించారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“చావు కబురు చల్లగా “మూవీ ప్రీ రిలీజ్ వేడుక 9వ తేదీ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ..”చావు కబురు చల్లగా “మూవీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందనీ, బస్తీ బాలరాజు గా కార్తికేయ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనీ, దర్శకుడు కౌశిక్ తన ప్రతిభ తో ఈ మూవీ ని తెరకెక్కించారనీ చెప్పారు. కొత్త కథలను ఎంపిక చేసుకుని సినిమాలు నిర్మించే అల్లు అరవింద్ జడ్జ్ మెంట్ కు హ్యాట్స్ ఆఫ్ అని దర్శకుడు సుకుమార్ చెప్పారు. కథ విన్నప్పుడు దర్శకుడు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తారనే నమ్మకం కలిగిందని అరవింద్ చెప్పారు.గీతా ఆర్ట్స్ వంటి గొప్ప బ్యానర్ లో నటించడం ఆనందంగా ఉందని హీరో కార్తికేయ చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: