అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్నసినిమా జాతి రత్నాలు. కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. స్వప్న సినిమాస్ బ్యానర్ పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా నిర్మిస్తున్న ఈసినిమా కు రాధన్ సంగీతం అందిస్తున్నాడు. ఫరియా అబ్దుల్లా కీలక పాత్రలో నటిస్తుండగా మురళీ శర్మ, నరేష్ వి.కె, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఇక రేపు ఈ సినిమా రిలీజ్ అవుతుండగా ఆసినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
* ఈసినిమాకు ఫస్ట్ ప్లస్ పాయింట్ కాస్టింగ్. నవీన్ పోలిశెట్టి లాంటి యంగా టాలెంటెడ్ నటుడిని
అతనితో పాటు ప్రస్తుతం టాలీవుడ్ లో కమెడియన్స్ గా మంచి ఫామ్ లో ఉన్న రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిని తీసుకోవడం. ఈ ముగ్గురితో చేసిన సందడి ఇప్పటికే టీజర్, ట్రైలర్ లో చూాశాం. మిగిలింది స్క్రీన్ పైన చూడాల్సిందే.
* అనుదీప్… నాగ్ అశ్విన్ తో ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేసిన అనుదీప్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఫస్ట్ టైమ్ ఇలా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించడం.. దానికి సస్పెన్స్ ను జోడించటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
* నాగ్ అశ్విన్.. మహానటి లాంటి సినిమా తీసిన నాగ్ అశ్విన్ ఈసినిమాకు నిర్మాతగా మారాడు. ఇప్పటికే ఈబ్యానర్ నుండి వచ్చిన రెండు సినిమాలు ఎవడే సుబ్రహ్మణ్య, మహానటి మంచి హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ సినిమాపై కూడా మంచి ఎక్స్ పెక్టేష్స్ ఉన్నాయి.
* హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.. మొదటి సినిమాకే ఈమెకు మంచి మార్కులు పడేట్టు కనిపిస్తున్నాయి. నవీన్ పోలిశెట్టికి జోడిగా నటిస్తుండగా.. ట్రైలర్ లో చూసిన తరువాత ఈ హీరోయిన్ ను ప్రశంసిస్తున్నారు అందరూ.
* సంగీతం.. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన చిట్టి సాంగ్.. అలాగే టైటిల్ ట్రాక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాకు సంగీతం అందించిన రథాన్ అంతకుముందు అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సంగీతం అందించడంతో ఈసినిమాకు కూడా అతని సంగీతం హైలెట్ అవుతుందంటున్నారు.
మరి ఎన్నో అంచనాల మధ్య రేపు రిలీజ్ అవుతున్న ఈసినిమా ఆ అంచనాలను ఎంత వరకూ అందుకుంటుందో చూడాలి..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: