‘పెళ్లి చూపులు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూ వర్మ. అంతకుముందు పలు సినిమాల్లో నటించినా.. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన పెళ్లిచూపులు సినిమాలో హీరోయిన్ గా తన నటనతో మంచి మార్కులు కొట్టేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా హిట్ తో విజయ్ కెరీర్ కు గాడి పడినా రీతూ వర్మకి మాత్రం తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పొచ్చు. దాంతో తమిళ .. మలయాళ భాషా చిత్రాలపై ఆమె దృష్టిపెట్టింది. అక్కడ అమ్మడికి బాగానే అవకాశాలు వచ్చాయి. ఇక ఇప్పుడు తెలుగులోకూడా బిజీ అయిపోయింది. ప్రస్తుతం నాని టక్ జగదీష్ సినిమాతో పాటు నాగశౌర్య వరుడు కావలెను సినిమాలో కూడా నటిస్తుంది. దీనితో పాటు శర్వానంద్ హీరోగా తెలుగు తమిళ్ లో తెరకెక్కుతున్న ఒక సినిమాలో కూడా రీతూ నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు నాగ చైతన్య చేయబోయే ఒక ప్రాజెక్ట్ లో కూడా రీతూ వర్మ హీరోయిన్ గా చేస్తుంది. మరి నేడు రీతూవర్మ పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో మీ ఓటు ద్వారా తెలియచేస్తూ బర్త్ డే విషెస్ అందించండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”57068″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: