ఒక మనసు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిననిహారిక ఆసినిమాలో తన నటనతో మంచి పేరే సంపాదించుకుంది. ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్, ప్రణీత్ దర్శకత్వంలో సూర్యకాంతం, తమిళ్ లో ఒక సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు కూడా నిహారికకు విజయం అందించలేకపోయాయి. అయితే సూర్యకాంతం సినిమాలో నిహారిక నటనకు మాత్రం అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకూ మరే సినిమా చేయలేదు. అయితే గత ఏడాది సైరా చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది. ఇక ఇటీవలే నిహారిక చైతన్యను పెళ్లి చేసుకొని వివాహా జీవితాన్ని కొనసాగిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి, నిహారిక ప్రధాన పాత్రల్లో ఆరుముగా కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్’. 2018 ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం విజయవంతం అయ్యింది. మూడేళ్ల తరవాత ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోకి ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ చిత్రం తెలుగు హాక్కులను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: