గత ఏడాది సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ వెంటనే ‘సర్కారు వారి పాట’ సినిమాను లైన్ లో పెట్టాడు. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్ మాత్రం ఇన్నిరోజులు పెండింగ్ లో పడిపోయింది. ఇక ఇప్పటికే చాలా మంది హీరోలు షూటింగ్లు మొదలు పెట్టి పూర్తి చేసి కొన్ని సినిమాలు రిలీజ్ కూడా అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఫైనల్లీ మహేష్ కూడా సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఫ్యామిలీ తో దుబాయ్ ప్రయాణం అయ్యారు కూడా. దుబాయ్ లో నమ్రత పుట్టిన రోజు సెలబ్రేషన్స్ జరుపుకున్న తర్వాత వచ్చే వారం నుంచి దుబాయ్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. కీర్తి సురేష్ కూడా ఇప్పటికే దుబాయ్ పయనమైంది. ఇక ఈ సందర్భంగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న థమన్ సేఫ్ గా ఉండాలని.. జాగ్రత్తగా షూటింగ్ జరుపుకోవాలని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
Wishing Our lovely Team of #SarkaruVaariPaata a Happy & Super Safe Shooting Ahead @ParasuramPetla ♥️
And Our #Superstar @urstrulyMahesh 🤍gaaru @madhie1 Sir @KeerthyOfficial 💚Our Gratitude & love to Our Prod Team @MythriOfficial @14ReelsPlus @GMBents FOR ALL THE EFFORTS TAKEN pic.twitter.com/v2gq2hXUTf
— thaman S (@MusicThaman) January 22, 2021
పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో పొడవాటి జుట్టుతో మెడ పైన ట్యాటూతో మాస్ లుక్ లో కనిపించనున్నాడు మహేష్. మిగిలిన నటీనటులు ఇతర వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: