టాలీవుడ్ లోఉన్న బెస్ట్ కపుల్ లో మహేష్ బాబు దంపతులది మొదటి వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ఫ్యామిలీకి మహేష్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. మరోపక్క నమ్రత కూడా ఇంటిని పిల్లల్ని చూసుకుంటూనే.. మహేష్ సినిమాలు, వ్యాపారాలు, ఫిట్ నెస్ ఇలా ప్రతీ ఒక్క విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. మహేష్ బాబు గురించి తెలియాలంటే నమ్రత సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాల్సిందే. మహేష్ బాబు చేసే అల్లరి, పిల్లలతో కలిసి చేసే సందడిని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. మహేష్ బాబు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా వుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా చాలా విషయాలను పంచుకుంటున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ రోజు నమ్రత పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా మహేష్ తన భార్యకు ప్రేమతో బర్త్ డే విషెస్ తెలియచేసాడు. నేను ప్రేమించే వ్యక్తి ఈ రోజు పుట్టింది.. నీతో ఉంటే ప్రతీ రోజూ ప్రత్యేకంగానే ఉంటుంది.. అయితే ఈ రోజు మాత్రం ఇంకొంచెం ఎక్కువ ప్రత్యేకం.. అద్భుతమైన మహిళ బర్త్ డేను సెలెబ్రేట్ చేస్తున్నాను.. హ్యాపీ బర్త్ డే బాస్ లేడీ అంటూ చాలా స్పెషల్ గా విషెస్ అందించాడు మహేష్.
View this post on Instagram
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: