స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రకుల్ కథానాయికగా రూపొందిన మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వ,లో నితిన్ హీరోగా రూపొందుతున్న “చెక్ “మూవీ లో రకుల్ నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ “అయలాన్ “, బ్లాక్ బస్టర్
“ఇండియన్ “మూవీ సీక్వెల్ “ఇండియన్2 ” తమిళ మూవీస్ లో రకుల్ కథానాయిక గా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




స్టార్ హీరోయిన్ రకుల్ ప్రస్తుతం “ఎటాక్ “, “సర్దార్ &గ్రాండ్ సన్ “, “మేడే ” లో నటిస్తున్నారు. బాలీవుడ్ మూవీస్ లో నటిస్తున్న రకుల్ మరో బాలీవుడ్ మూవీ “థ్యాంక్ గాడ్ “మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. శివకార్తికేయన్ హీరోగా రూపొందుతున్న “అయలాన్ “మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన రకుల్ ముంబై చేరుకున్నారు. టి – సిరీస్ , మారుతీ ఇంటర్ నేషనల్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఇంద్ర కుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ , సిద్ధార్ధ్ మల్హోత్రా , రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న “థ్యాంక్ గాడ్ “మూవీ షూటింగ్ నిన్న ముంబై లో ప్రారంభం అయ్యింది. కరోనా నుండి కోలుకున్న కొన్ని రోజులకే రకుల్ సూపర్ ఎనర్జీ తో షూటింగ్స్ లో పాల్గొనడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: