యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు. రాధేశ్యామ్ అయిపోయిందో లేదో ‘కెజిఎఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్‌తో ‘సలార్ సినిమాను ప్రారంభించారు.అప్పుడే ఆదిపురుష్ సినిమాను మొదలుపెట్టేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మోషన్ క్యాప్చర్ వర్క్ స్టార్ట్ చేసినట్టు చెప్పాడు డైరెక్టర్ ఓం రౌత్. ఇక ఈ సినిమా లాంచింగ్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 2వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ముంబైలోని ఓ స్టూడియోలో ప్రారంభించనున్నారని.. అలాగే దాదాపు ఎక్కువ శాతం మూవీ అదే స్టూడియోలో చిత్రీకరించనున్నట్లుగా తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఓం రౌత్ ప్రకటించిన సంగతి కూడా విదితమే. ఆగస్ట్ 11,2022న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: