కోబ్రా టీజర్ రిలీజ్ – డిఫరెంట్ షేడ్స్‌లో విక్రమ్

Vikram Latest Movie Cobra Teaser Is Out,Cobra, Cobra : Vikram As A Mathematician Detective Faces Off Against Irfan Khan In The Teaser, Cobra Movie, Cobra Movie Teaser, Cobra Movie Updates, Cobra Official Teaser, Cobra Teaser, Cobra Telugu Movie, Cobra Telugu Movie Latest News, Cobra Telugu Movie Teaser, latest telugu movies news, Latest Tollywood News, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates, Vikram Cobra Movie Teaser

‘చియాన్’ విక్రమ్ ఒక సినిమా కోసం ఎంత కష్టపడతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు ఆయన నటించిన ‘అపరిచితుడు’, ‘ఐ’, ‘ఇంకొక్కడు’ సినిమాలనే ఉదాహరణగా చెప్పొచ్చు. తన కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే క్యారెక్టర్స్‌తో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేశాడు విక్రమ్. ఇక ప్రస్తుతం విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘కోబ్రా’. ఇక ఈ సినిమాలో విక్రమ్ ఏకంగా 20కు పైగా గెటప్స్ తో వస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ‘కోబ్రా’ టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. విక్రమ్ ఎప్పటిలానే తన నటనతో అలరించారు. పలు గెటప్స్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేశారు. మేథమెటిక్స్‌తో ఎలాంటి సమస్యనైనా సాల్వ్ చేసే జీనియస్‌గా చూపించారు. గెటప్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంటున్నాయి. ఇర్ఫాన్ పఠాన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సినిమాతోనే ఇర్ఫాన్ పఠాన్ వెండితెర ఆరంగేట్రం చేస్తున్నారు. టీజర్ మొదటి షాట్ నుంచి చివరి వరకూ ఇర్ఫాన్ పఠాన్‌ని బాగా హైలైట్ చేశారు. ఇక టీజర్ తో సినిమాపై ఇంకా అంచనాలు పెంచేశారు.

కాగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను వయకామ్ .. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కేఎస్‌ రవికుమార్‌, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.