సూపర్ హిట్ “పెళ్ళిచూపులు “మూవీ తో హీరోగా పరిచయం అయిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోగా మారారు. “గీత గోవిందం ” , “టాక్సీవాలా “వంటి సూపర్ హిట్ మూవీస్ తో అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ స్వంతం చేసుకున్నారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్
పాన్ ఇండియా మూవీ “ఫైటర్ “లో నటిస్తున్నారు. ఈ మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రతీ సంవత్సరం క్రిస్మస్ పండగకు విజయ్ దేవరకొండ , దేవర -శాంటా పేరు తో గిఫ్ట్స్ పంచుతారు. ఈ సంవత్సరం 600 మంది అనాథ బాల బాలికలకు కొత్త దుస్తులను గిఫ్ట్ గా ఇచ్చి ఆనందాన్ని కలిగించారు. హీరో విజయ్ వర్చువల్లీ కిడ్స్ తో సమావేశమయ్యి , అనాథ శరణాలలో కేక్ కటింగ్ చేసి కిడ్స్ ప్రశ్నలకు జవాబిస్తూ వారికి ఆనందాన్ని పంచారు. అనాథ శరణాలయాలకు ఏ విధమైన సహాయం చేయడానికైనా తాను సిద్ధం అని చెప్పారు. క్రిస్మస్ రోజున విజయ్ అనాథ బాల , బాలికల కు సంతోషం కలిగించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: