అస్వస్థతకు గురైన ‘తలైవా’

2020 Telugu Movies News, Annaatthe, Annaatthe Telugu Movie, Blood Pressure Fluctuations To Rajinikanth, Hyderabad, latest telugu movies news, Latest Tollywood News, Rajinikanth, Rajinikanth Health, Rajinikanth Health News, Rajinikanth Health Updates, Rajinikanth Rushed To Hospital, Rajinikanth Rushed To Hospital In Hyderabad, Superstar Rajinikanth Latest News, Telugu Filmnagar, Telugu Movies Updates, Tollywood Movie Updates

సూపర్ స్టార్ రజినీ కాంత్ అస్వస్థతకు గురైన వార్త అటు సినీ పరిశ్రమలనే కాదు అభిమానులను సైతం ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం రజినీ అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం హైద్రాబాద్ లో ఉన్నారు. అయితే చిత్ర సిబ్బందిలో దాదాపు 4గురికి కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ ను కూడా రద్దు చేశారు. ప్రస్తుతం రజినీ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే నిన్న రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో బాధపడుతున్న రజినీ.. జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో చేరారు. రజినీ హైబీపీతో బాధపడుతున్నారని హాస్పిటల్ యాజమాన్యం అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రజినీ అనారోగ్యానికి గురయ్యారనే వార్తతో చిత్ర పరిశ్రమ, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం రజినీకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఇవాళ రాత్రి వరకు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని, రేపు ఉదయం డిశ్చార్జ్ చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. మరో వైపు రజినీ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీస్ ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు సైతం చేస్తున్నారు.

శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది. ఇటీవలే మళ్లీ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − fourteen =