ఎ స్టూడియోస్ , పెన్ మూవీస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ స్మార్ట్ ప్లే ట్యాగ్ లైన్ తో “ఖిలాడి”మూవీ రూపొందుతుంది. హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సింహద మారి సైన్య ” కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన అర్జున్ “నండ్రి “మూవీ తో కోలీవుడ్ కు , “మా పల్లెలో గోపాలుడు “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. నాలుగు దశాబ్దాలుగా దక్షిణాది భాషల తో పాటు హిందీ మూవీస్ లో కూడా నటించిన అర్జున్ సుమారు 150 మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నటుడు , నిర్మాత , దర్శకుడు అర్జున్ ప్రస్తుతం 3 తమిళ చిత్రాలలో నటిస్తున్నారు. “మరక్కార్ “మలయాళ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. యాక్షన్ కింగ్ అర్జున్ ఇప్పుడు “ఖిలాడి ” మూవీ లో విలన్ గా ఎంపిక అయ్యారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: