ఛాలెంజింగ్ రోల్ లో త్రిష

Actress Trisha Takes Up Another Challenging Role

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని త్రిష స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో త్రిష ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటించిన 3 తమిళ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. 4 తమిళ మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. త్రిష ఇప్పుడు తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న బ్లాక్ బస్టర్ బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎమ్ఎస్ఎమ్ మోషన్ పిక్చర్స్ , సరస్వతి ఎంటర్ టైన్ మెంట్ క్రియేషన్స్ , రైజింగ్ సన్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై షూజిత్ సర్కార్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ , దీపికా పడుకునే , ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “పీకు” హిందీ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వినోదం , భావోద్వేగాల కలబోత తో తెరకెక్కిన ఈ మూవీ లో అమితాబ్ , దీపిక తండ్రీ కూతుళ్ళు గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా అమితాబ్ నేషనల్ అవార్డ్ , బెస్ట్ యాక్ట్రెస్ గా దీపిక ఫిల్మ్ ఫేర్ అవార్డ్అందుకున్నారు. విశేష ప్రేక్షకాదరణ పొందిన “పీకు” మూవీ బెస్ట్ ఫిల్మ్ గా పలు అవార్డ్స్ అందుకుంది. ఇప్పుడు “పీకు” మూవీ తెలుగు , తమిళ భాషలలో రీమేక్ కానుంది. ఛాలెంజింగ్ రోల్లో నటించిన దీపిక పాత్రకు త్రిష ఎంపిక అయ్యారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here