కెరీర్ మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. గత ఏడాది వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా చేసి మంచి టాక్ ను తెచ్చుకోగా.. ప్రస్తుతం ” రాజ రాజ చోర” సినిమాతో బిజీ గా వున్నాడు. హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రాగా ఇప్పుడు మళ్లీ షూట్ ను ప్రారంభించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చేస్తున్నాడు. శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాలి సంపత్. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూట్ ను మొదలుపెట్టింది. ప్రస్తుతం అరకులో షూటింగ్ జరుపుకుంటోంది. రాజేంద్ర ప్రసాద్, హీరో శ్రీ విష్ణు తో పాటూ సినిమాలో ముఖ్య తారాగణం మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ డిసెంబర్ 5 వరకు జరుగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ ఉంటుంది.
కాగా ఈ మూవీని ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బేనర్ పై ఎస్. క్రిష్ణ, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై మజిలీ వంటి హిట్ చిత్రాలు నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి నిర్మిస్తున్నారు. ఎస్. క్రిష్ణ పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకూ అనిల్ రావిపూడి అన్ని చిత్రాలకు కో డైరెక్టర్, రైటర్ గా వర్క్ చేశారు. ఇప్పుడు మొదటిసారి నిర్మాతగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని సమర్పిస్తూ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, మిర్చి కిరణ్, సురేంద్ర రెడ్డి, గగన్, మిమ్స్ మధు, అనీష్ కురువిల్లా, రజిత, కరాటే కళ్యాణి, సాయి శ్రీనివాస్, రూపలక్ష్మి తదితరులు నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమా మీద మంచి అంచనాలుక్రియేట్ చేసింది. తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఒక డిఫరెంట్ ఎమోషన్ తో అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్ మెంట్ తో బ్యూటిఫుల్ జర్నీ గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: