కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

మెగా - మంచు దీపావళి

మెగా - మంచు దీపావళి

Mega and Manchu Families Celebrate Diwali Together

మెగా ఫ్యామిలీ- మంచు ఫ్యామిలీల మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పుడప్పుడు చిరు,మోహన్ బాబు సరదాగా కౌంటర్లు వేసుకున్నా రెండు ఫ్యామిలీస్ మధ్య బంధం వేరు. కేవలం ఈ రెండు ఫ్యామిలీస్ మాత్రమే కాదులెండి టాలీవుడ్ లో అక్కినేని,మెగా,నందమూరి, దగ్గుబాటి, మంచు ఫ్యామిలీస్ దాదాపు సన్నిహిత్యంగానే ఉంటాయి. ఇక హీరోస్ మంచు మనోజ్, చరణ్, ఎన్టీఆర్, రానా, మహేష్ వీళ్ళ మధ్య ఫ్రెండ్ షిప్ కూడా అందరికీ తెలుసు.

ఇక గత రెండు రోజుల క్రితం అందరూ దీపావళి జరుపుకున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు సైతం తమ తమ ఇళ్లలో దీపావళిని జరుపుకున్నారు. ఈ క్రమంలో మంచు ఫ్యామిలీలో జరిగిన దీపావళి వేడుకల్లో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని మంచు మనోజ్‌ తన ట్విట్టర్ లో తెలిపాడు. నాకు ఎంతో ఇష్టమైన సోదరుడు రామ్ చరణ్‌, ఇష్టమైన అక్క మంచు లక్ష్మితో మంచి సమయం గడిచింది. దీపావళి‌ని నాకు ఇష్టమైన వారితో జరుపుకున్నా అని ఓ ఫొటోను కూడా షేర్ చేసాడు.

కాగా రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తుండగా, చిరంజీవి ఆచార్యలోనూ కనిపించనున్నారు. మరోవైపు మనోజ్‌, శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో అహం బ్రహ్మాస్మి అనే సినిమాలో కనిపించనున్నాడు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్