శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియెషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “లవ్ స్టోరీ “మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. రావు రమేష్ , పోసాని , దేవయాని , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సిహెచ్ సంగీతం అందించారు . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న “లవ్ స్టోరీ ” మూవీ ని త్వరలోనే రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“లవ్ స్టోరీ ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీపావళి పండగ సందర్భంగా చిత్ర యూనిట్ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. హృద్యమైన అంశాలతో సాగే అద్భుత ప్రేమకథ గా “లవ్ స్టోరీ “మూవీ ని దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. హీరో నాగచైతన్య , సాయి పల్లవి ల కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణ గా రూపొందిన “లవ్ స్టోరీ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: