మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ రేంజ్ ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలుభాషల్లో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది కీర్తి సురేష్. ఇప్పటికే ఈమె నటించిన లేడీ ప్రధాన పాత్రలో వచ్చిన ‘పెంగ్విన్’, మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అయితే ఆ రెండు సినిమాలు కాస్త నిరాశనే మిగిల్చాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మరో రెండు, మూడు మహిళా ప్రధానమైన సినిమాలు లైన్ లో ఉన్నాయి. కీర్తి అమిత్ శర్మ దర్శకత్వంలో ‘మైదాన్’ సినిమాలో నటిస్తుంది. ఇంకా బాలీవుడ్ డైరెక్టర్ కుకునూర్ దర్శకత్వంలో ‘గుడ్ లక్ సఖి’ లో నటిస్తుంది. మహేష్ తో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో కూడానటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో కొత్త సినిమాతో రాబోతుంది. కీర్తీ సురేష్, దర్శకుడు సెల్వ రాఘవన్ నటీనటులుగా రూపొందుతున్న తమిళ చిత్రం ‘సాని కాయిదం’. అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వంలో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ధనుష్ విడుదల చేశారు. కీర్తిసురేష్, సెల్వ రాఘవన్ డీగ్లామరైజ్డ్ లుక్ లో కాస్త భయపడుతున్నట్టుగా కనిపిస్తున్న స్టిల్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
కాగా ‘7/జి బృందావన కాలనీ’, ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాలతో దర్శకుడు సెల్వ రాఘవన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఇక సెల్వ రాఘవన్ సరసన కీర్తీ సురేష్ నటిస్తుండటం ఈ సినిమా ప్రత్యేకత. మరి చూడబోతే ఈ సినిమా కూడా విభిన్నంగానే ఉండబోతున్నట్టు కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: