శ్రద్ధా శ్రీనాథ్ ‘కలియుగం’

Jersey Fame Shraddha Srinath To Come Back With A Horror Thriller Movie Titled Kaliyugam

‘జెర్సీ’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది శ్రద్ధ. ఆ సినిమాలో శ్రద్ధా.. తన నటనతో అదరగొట్టింది. ఇటీవలే తెలుగులో నటించిన ‘కృష్ణ అండ్ హిజ్‌ లీల’ మూవీ ఓటీటీలో రిలీజ్‌అయింది. ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక తెలుగులోనే కాకుండా అటు కన్నడ, తమిళ సినిమాలు చేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతుంది. హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న “కలియుగం” అనే కథతో రాబోతుంది. ఎన్నోషార్ట్ ఫిలిమ్స్, యాడ్స్ కి డైరెక్టర్ గా పనిచేసిన ప్రమోద్ సుందర్ తొలిసారిగా మెగా ఫోన్ పట్టి ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. శ్రద్దా శ్రీనాథ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ “నేను కథ విన్న వెంటనే ఈ సినిమా చేయాలనీ ,అంత గొప్ప కథ ఇది అని.. ఒక ఫ్రెష్ కథతో ఒక గొప్ప సినిమా చూశాం అనే ఫీలింగ్ కలుగుతుందనే నమ్మకం ప్రేక్షకులకు కలుగుతుందని చెప్పింది.

 

కాగా ఈ సినిమాను “ఆర్ కె ఇంటర్నేషనల్” బ్యానర్ లో కె ఎస్ రామకృష్ణ నిర్మించనున్నారు. ఇండియన్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ దగ్గర చాలా సంవత్సరాలు అసిస్టెంట్ గా పనిచేసిన రామ్ చరణ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. మిగతా నటీనటుల విషయాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.