సెలబ్రిటీస్ కు నెటిజన్స్ కామెంట్స్ చేయడం.. వాటికి సెలబ్రిటీస్ కౌంటర్ లు ఇవ్వడం కామన్ థింగ్. ఒక్కోసారి నెటిజన్స్ కు సెలెబ్రిటీస్ కు సోషల్ మీడియా వేదికగా వర్డ్స్ వారే జరుగుతుంది. ఇక టాలీవుడ్ సమంతకు కూడా కామెంట్స్ కౌంటర్లు కొత్తేమి కాదు. ఇప్పటికే చాలామంది నెటిజన్స్ కు తన కౌంటర్ లతో షాకిచ్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇక తాజాగా మరోసారి అలాంటి సంఘటనే ఎదురైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు సమంత తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. `ఫీలింగ్ గుడ్` అంటూ సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను షేర్ చేసింది. దీనికి స్పందించిన ఓ నెటిజన్.. `చైతన్యకి విడాకులు ఇచ్చేయ్.. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం` అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు సమంత స్పందిస్తూ.. `కష్టం.. ఒక పని చెయ్.. చైని అడుగు` అని రిప్లై ఇచ్చింది.
ఇక వివాహం తర్వాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తూ ఫుల్ బిజీగా ఉంది సమంత. వరుస సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్తుంది. గత యేడాది నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా ఆ తర్వాత ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబి’ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. ’96’ రీమేక్‌లో చేసినా అది కాస్త నిరాశ పరిచింది. ప్రస్తుతం గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో.. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తుంది. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లు, బిజినెస్.. ఇలా పలు రంగాల్లో రాణిస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: