హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న “టక్ జగదీష్ “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా “మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తరువాత సూప్ హిట్ “బ్రోచేవారెవరురా “మూవీ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక మూవీని హీరో నాని ఓకే చేశారు. వరస చిత్రాలతో హీరో నాని బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నీహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో “శ్యామ్ సింగరాయ్ “మూవీ రూపొందనుంది. డిసెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ లో టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి , “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయికలు. “జెర్సీ “, “V” వంటి మూవీస్ లో ఛాలెంజింగ్ రోల్స్ లో నటించి హీరో నాని ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. హీరో నాని ఇప్పుడు “శ్యామ్ సింగరాయ్”మూవీ లో 65 సంవత్సరాల ఓల్డ్ ఏజ్ పర్సన్ గా మరో ఛాలెంజింగ్ రోల్ లో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: