తమిళ్ స్టార్ హీరో కార్తీ మొదటి నుండీ కాస్త విభిన్నంగానే సినిమాలు చేస్తుంటాడు. ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటాడు. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి కథతోనే వస్తున్నాడు. అదే ‘సుల్తాన్’.. రెమో ఫేమ్ బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో కార్తీ, రష్మిక హీరో హీరోయిన్స్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేయబోతున్నట్లుగా.. డేట్, టైమ్‌ని తెలుపుతూ.. చిత్రయూనిట్ ఓ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను అక్టోబర్ 26 ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా ఈ పోస్టర్‌లో తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Jaisultan 🔥🔥💪💪 @Karthi_Offl sir @Prabhu_sr sir @srprakashbabu sir @iamRashmika @sathyaDP @DreamWarriorpic https://t.co/Xmtu3fIZuz
— Bakkiyaraj kannan (@Bakkiyaraj_k) October 23, 2020
కాగా ‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తీ, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్ లోనే ఈ సినిమా రూపొందనుంది. ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంగీతం: వివేక్ మెర్విన్, ఎడిటింగ్: అంతొనీ, సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
మరోవైపు కార్తీ మణిరత్నం రూపొందించబోయే `పొన్నియన్ సెల్వమ్` సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత `ఖైదీ` సీక్వెల్‌ను కార్తీ పట్టాలెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఎంత తొందరగా సీక్వెల్ ను మొదలుపెడితే అంత బెటర్ అని ఆలోచిస్తున్నారట. మరి చూద్దాం ఏం జరుగుతుందో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: