తెలుగు , తమిళ , మలయాళ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి ప్రధాన పాత్రలో నటించిన “మిస్ ఇండియా “, “గుడ్ లక్ సఖి ” మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటున్నాయి. “రంగ్ దే “(తెలుగు ), “అన్నాత్తే “(తమిళ) మూవీస్ చిత్రీకరణ దశలో ఉన్నాయి. “మరక్కార్ “(మలయాళ ) మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ శిష్యుడు రామ్ ప్రసాద్ రౌతు దర్శకత్వంలో నవీన్ విజయ్ కృష్ణ , కీర్తి సురేష్ జంటగా “ఐనా నా ఇష్టం నువ్వు ” మూవీ రూపొందుతుంది. ఇప్పుడు ఆ మూవీ టైటిల్ ను “జానకితో నేను ” గా మార్చారు. నిర్మాత అడ్డాల చంటి మాట్లాడుతూ.. నాలుగు లేదా ఐదు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యిందని , త్వరలోనే కీర్తి సురేష్ పై ఆ బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేస్తామని , అక్టోబర్ మొదటి వారం లో “జానకితో నేను ” మూవీ ఫస్ట్ కాపీ సిద్ధమవుతుందని , థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత రిలీజ్ చేస్తామని తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: