“జబర్దస్త్ ” కామెడీ టీవీ షో తో షకలక శంకర్ కమెడియన్ గా పాపులర్ అయ్యారు. తన కామెడీ టైమింగ్ తో శంకర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “రాజు గారి గది “, “ఆనందో బ్రహ్మ “, “నందిని నర్సింగ్ హోమ్ “, “3 మంకీస్ “వంటి పలు మూవీస్ లో కమెడియన్ గా నటించి శంకర్ ప్రేక్షకులను అలరించారు. “శంభో శంకర “, నేనే కేడి నెం 1 “, “డ్రైవర్ రాముడు “వంటి మూవీస్ లో హీరోగా నటించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను ఇమిటేట్ చేసి ప్రేక్షకులను అలరించే శంకర్ , వర్మ పై వ్యతిరేకంగా రూపొందుతున్న మూవీస్ తో బిజీగా ఉన్నారు.మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిన్నికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గాంధీ మోహన్ రెడ్డి దర్శకత్వంలో షకలక శంకర్ హీరోగా “లాస్ట్ గాడ్ ఫాదర్ “మూవీ ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ క్లాప్ తో ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా హీరో శంకర్ మాట్లాడుతూ . . తన కెరీర్ ఈ బ్యానర్ తోనే ప్రారంభం అయ్యిందనీ , నిర్మాత వెలంపల్లి ప్రసాద్ “నోట్ బుక్ ” మూవీ లో తొలి అవకాశం ఇచ్చారని , తిరిగి వారి బ్యానర్ లో నటించడం ఆనందంగా ఉందనీ , దర్శకుడు వినాయక్ గారు క్లాప్ కొట్టి ఆశీర్వదించారనీ , ఈ రోజు తనకు గొప్ప పండగ రోజనీ చెప్పారు . దర్శకుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ .. “లాస్ట్ గాడ్ ఫాదర్ “మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించే మూవీ గా రూపొందనుందనీ , సంగీతం సాయి కార్తీక్ అందిస్తున్నారనీ, మిగతా నటీ నటులను త్వరలోనే ప్రకటిస్తామనీ చెప్పారు. “లాస్ట్ గాడ్ ఫాదర్ “మూవీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన దర్శకుడు వినాయక్ , నిర్మాత మల్లిడి సత్యనారాయణ , దర్శకుడు డాలి , నిర్మాత నల్లమలుపు బుజ్జి లకు నిర్మాత ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: