టాలీవుడ్ లో కామెడీ కింగ్ బ్రహ్మానందం తరువాత తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు కమెడియన్ కమ్ హీరో సునీల్. గోదావరి యాసలో మాట్లాడుతూ.. ఓ వెరైటీ టోన్ తో తన కామెడీ మార్క్ ను చూపించాడు. అసలు సొంతం సినిమాలో సునీల్ కామెడీ ఆ సినిమాకే పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ తరువాత వచ్చిన నువ్వునాకు నచ్చావ్, నువ్వే నువ్వే, మల్లీశ్వరి, ఎలా చెప్పను, ఇలా చెప్పుకుంటూ పోతే సునీల్ చేసిన మరిచిపోలేని.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాలు ఎన్నో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ తరువాత అందాల రాముడు సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చి అది కాస్త హిట్ అవ్వడంతో హీరోగానే ఫోకస్ పెట్టాడు. ఆ తరువాత వచ్చిన మర్వాద రామన్న సినిమా ఇంకా సక్సెస్ అవ్వడంతో పూర్తిగా కామెడీ రోల్స్ కు గుడ్ బై చెప్పి సినిమాలే చేసుకుంటూ వెళ్లాడు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ పెద్దగా సక్సెస్ ను అందించలేకపోయాయి. ఆ తర్వాత మళ్లీ అరవింద సమేత నుండి పలు సినిమాల్లో కామెడీ పాత్రలతో పాటు కీలక పాత్రలు నటిస్తున్నాడు.
ఇక ఇప్పుడు మళ్లీ హీరోగా కొత్త సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ కథ అందిస్తున్న ఈసినిమాలో సునీల్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా టైటిల్ ను ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. ‘వేదాంతం రాఘవయ్య’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 14 రీల్స్ ప్లస్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమాలో నటించబోయే నటీనటులు, దర్శకుడు సహా ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని తెలిపారు. మరి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ హీరోగా సునీల్ రాబోతున్నాడు. మరి ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
We are very Happy & Thrilled to announce our next project titled #VedanthamRaghavaiah. Starring everyone’s favourite actor @Mee_Sunil with Story by the blockbuster director @harish2you.
More details soon… pic.twitter.com/Pl2DZxZI2y
— 14 Reels Plus (@14ReelsPlus) August 31, 2020




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: