నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తరువాత నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “లవ్ స్టోరీ ” మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హీరో నాగచైతన్య తెలంగాణ యువకుడిగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. కరోనా కారణం గా “లవ్ స్టోరీ ” మూవీ షూటింగ్ వాయిదా పడింది. భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ తరువాత నాగచైతన్య మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “థ్యాంక్ యూ ” మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో నాగచైతన్య క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్ లో ఉంటుందని , నాగచైతన్య మూడు విభిన్న తరహా గెటప్స్ లో ప్రేక్షకులను అలరించనున్నారని సమాచారం. “మజిలీ “, “వెంకీ మామ ” వంటి సూపర్ హిట్ మూవీస్ తరువాత హీరో నాగచైతన్య సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: