నిజజీవితంలో సెంటి మెంట్స్ ఎలా ఉంటాయో.. వాటిని మనం ఎలా తప్పకుండా ఆచరిస్తామో.. సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ ఫాలో అయ్యేవారు నూటికి 90 శాతం మంది ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ పాటించడం చూస్తుంటాం. సినిమా మొదలు పెట్టినదగ్గరనుండి.. రిలీజ్ అయినంత వరకు ముహుర్తాలు చూసుకుంటారు. హీరోలకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి.. అలానే డైరెక్టర్స్ కి కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వాటిని తప్పకుండా సినిమాలో ఉండేలా చూసుకుంటారు. అవి కొన్ని సార్లు వర్కౌట్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ సెంటిమెంట్స్ మాత్రం ఫాలో అయిపోతారు. కొన్నిసార్లు వాళ్ళు పాటించినా పాటించకపోయినా ఆ సెంటిమెంట్ మాత్రం అలా వారిని ఫాలో అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ – నాని కాంబినేషన్ లో వస్తున్న ‘వి’ సినిమాను కూడా వెంటాడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాని సిల్వర్ జూబ్లీ చిత్రం వి మూవీ ఓటీటీలో విడుదల కానున్నట్టు గతకొద్దిరోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చేసారు. తాజాగా అఫీషియల్ ప్రకటన చేశారు. సెప్టెంబర్ 5న చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నట్టు అధికారికంగా తెలిపారు.
అయితే ఇక్కడ సెంటిమెంట్ ఏంటంటే నాని హీరోగా వెండి తెరకు పరిచమైన తొలి చిత్రం ‘అష్టాచమ్మా’ సినిమా సెప్టెంబర్ 5న విడుదలైంది. ఈసినిమాకు కూడా ఇంద్రగంటినే డైరెక్టర్. ఇప్పుడు వీరిద్దరి డైరెక్షన్ లో వస్తున్న 25వ చిత్రం కూడా సెప్టెంబర్ 5 న విడుదలవ్వబోతుంది. మరి అష్టా చమ్మా సినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. మరి ఆ సెంటిమెంట్ ఇప్పుడు ‘వి’ కు వర్క్ అవుట్ అవుతుందో లేదో…? చూద్దాం..!
ఈ సందర్భంగా నాని తన ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు. ఇన్నాళ్ళు తన కోసం థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుల కోసం ఈ సారి తనే మీ ఇంటికి వస్తున్నట్టు తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని తనకి గుర్తుండిపోయేలా చేయాలని కోరాడు. టక్ జగదీష్ మాత్రం తప్పక థియేటర్‌లో విడుదల చేస్తామని మాటిచ్చాడు. కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తుండడం, ఇప్పట్లో థియేటర్స్ తెరుచుకునే పరిస్థితులు లేకపోవడంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
V is coming home ❤️
September 5th.. The Hunt is On!@PrimeVideoIN #VOnPrime pic.twitter.com/28Lpb21RuE
— Nani (@NameisNani) August 20, 2020
కాగా సుధీర్ బాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్, అదితి రావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్, హర్షిత్ రెడ్డి రూపొందుతున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: