అనూప్ భండారీ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ హీరోగా ఫాంటమ్ కన్నడ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వల్ల గత కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించినట్టు సుదీప్ తెలిపాడు. కరోనా వల్ల ఇన్నిరోజులు షూటింగ్ కు దూరంగా ఉన్నానని.. చాలా రోజుల తర్వాత షూటింగ్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ ప్రారంభం అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమానుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ ను బట్టి చూస్తుంటే ఫాంటమ్ చిత్రంలో విక్రాంత్ రోనా అనే పాత్ర పోషిస్తున్నట్టుతెలుస్తుంది. ఇందులో సుదీప్ చేతిలో గన్ పట్టుకొని రాయల్‌గా కూర్చొని ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ ఫోటో నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
#vikranthRona#TheWorldOfPhantom pic.twitter.com/M52TvlKc3w
— Kichcha Sudeepa (@KicchaSudeep) August 10, 2020
వైవిధ్యమైన చిత్రాలలో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు సుదీప్. ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాతో విలన్ గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు కన్నడ స్టార్ సుదీప్. ఆ తర్వాత బాహుబలి ది బిగినింగ్ ఇంకా సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)